-సత్తుపల్లిపై సీఎం దృష్టి..!
– కాంగ్రెస్ గెలుపునకు ఆ ముగ్గురు సై..!!
రెండు పర్యాయాలు ఓటమి పాలైన బీఆర్ఎస్ ను ఈసారి గెలిపించే ప్రయత్నం సీఎం స్థాయిలో గట్టిగా సాగుతుంది. కాదనకుండా మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఈసారి వాళ్ళ ఖాతాలో జమ చేసుకునే పనిలో పడినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి కాంగ్రెస్, టిడిపి అభ్యర్థులు తలా కొంతకాలం ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం నుంచి రెండు పర్యా యాలు టిడిపి అభ్యర్థిగా, 2018లో కాంగ్రెస్, టిడిపి పొత్తులో విజయం సాధించిన శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ముఖ్యంగా టిడిపి బలపడటం కోసం తీవ్రంగా కృషి జరిపిన విషయం తెలిసిందే. క్యాడర్ ను కూడా గట్టిగా తయారు చేశారు. అయితే తెలంగాణ ఏర్పడిన అనంతరం టిడిపి ఆంధ్ర పార్టీగా ముద్ర పడటంతో అయన టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు నాయకులు కూడా కొందరు పార్టీ మారారు. అయితే ఇంత జరిగినా టిడిపి ఓటింగ్ శాతంలో మాత్రం ఎక్కడా తేడా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకే వాళ్లు పని చేసేందుకు కృత నిశ్చయంతో కనిపిస్తున్నారు. మరోవైపు దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నుంచి కాంగ్రెస్ శాసన సభ్యులుగా కొనసాగిన జలగం వెంకటరావు వరకు కాంగ్రెస్ బలోపేతం కోసం గట్టిగా కృషి జరిగిన విషయం తెలిసిందే. వాళ్లు పార్టీ మారినప్పటికీ ఆ పార్టీ ఓట్ బ్యాంకు మాత్రం చెక్కు చెదరకుండా నిలకడగానే ఉం ది. ఈ నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలను కాదని మూడవ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకును వారి ఖాతాలో వేసుకోవాల్సిందే. అయితే ఇది సాధ్యపడేనా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో సత్తుపల్లి నియోజకవర్గంను కారు గుర్తు ఖాతాకు చేర్చాలంటే ఊహించని పరిణామాలు జరగాల్సిందే అని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆయన దృష్టి పెట్టి అడిగిన పథకాలు కాదనకుండా మంజూరు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం జరుపుతున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఎంతవరకు సాధ్యపడుతుందో వేచి చూడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.
కాంగ్రెస్ గెలుపుకు ఆ ముగ్గురు సై..
వ్యక్తిగత కారణాలు కారణమా.. పార్టీలో విమడలేని పరిస్థితి ఏర్పడిందా అనే అంశాలు పక్కనపెడితే టిఆర్ఎస్ ను వీడిన ముగ్గురు నాయకులు ఈసారి సత్తుపల్లిలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు తొడ కొడు
తున్న సంఘటనలు చూస్తున్నాం.. ఇప్పటికే పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబు వాళ్ళ అనుచరులను కాంగ్రెస్ విజయం కోసం విస్తృతంగా తిప్పుతున్న సంగతి తెలిసిందే. ఇక రేపో మాపో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగు తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ను గెలిపించాలనే ఆలోచనతో ఈసారి గట్టి ప్రయత్నంలో కనిపిస్తున్నట్లు తన అనుచరులు చెబుతున్నారు. ఈనెల 17న సోనియా గాంధీ అధ్యక్షతన హైదరాబాదులో జరిగే బహిరంగ సభలో తుమ్మల కాంగ్రెస్ తీర్థం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నియోజ కవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి వస్తున్న అభిమానులు, అనుచరులతో తన స్వగ్రామం దమ్మపేట మండలం గండుగులపల్లిలో కలుసుకుంటున్నారు. వచ్చిన వారితో మనం 40యేళ్లు చేసిన రాజకీయం వేరు, ఈ 4 నెలలు చేసే రాజకీయం వేరు అంటూ గట్టిగా పని చేయాలని సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఆయన కూడా ఈసారి గట్టిగా ఉన్నట్లు గా కనిపిస్తుంది. కాగా ఈ మొత్తం ఎపిసోడ్ ను పరిశీలిస్తే బిఆర్ఎస్ ను గెలిపించే ఆలోచనతో సాక్షాత్ ముఖ్య మంత్రి రంగంలోకి దిగితే… కాంగ్రెస్ ను గెలిపించే ప్రయత్నంలో ముగ్గురు రాజకీయ ఉద్దండులు కంకణం కట్టుకున్న నేపథ్యంలో ఈసారి సత్తుపల్లిలో జరిగే ఎన్నికలు ఒకవైపు అత్యంత ఖరీదు గానూ.. మరోవైపు నువ్వా నేనా అన్నట్లుగా సాగే అవకాశం ఉందని మేధావి వర్గం భావిస్తుండటం విశేషం.
[zombify_post]