పాడేరు, అల్లూరి జిల్లా: పాడేరు జిల్లా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడుతోంది. ఇటీవల వర్షాల నేపథ్యంలో జలుబు, దగ్గు, జ్వరం, కాలానుగుణ వ్యాధులతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారు.శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఓపీ విభాగం వద్ద భారీగా రోగులు బారులుదీరి కనిపించారు. పలు విభాగాల వద్ద వైద్యం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. రోగుల వివరాలు నమోదు చేసే వెబ్‌సైట్‌లో సమస్య ఉండటంతో కొంత ఆలస్యం జరుగుతోందని ఆసుపత్రి ఓపీ సిబ్బంది తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 450 నుంచి 500 వరకు ఓపీ నమోదవుతోందని ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ కృష్ణారావు తెలిపారు. ప్రస్తుత వర్షాలతో తాగునీరు కలుషితం, వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. ఆసుపత్రిలో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు
[zombify_post]