అల్లూరి జిల్లా: వై.రామవరం మండలంలోని బొడ్డపల్లి గ్రామ సమీపంలో బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో గురువారం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 3వ తేదీన ఆమైపె 16ఏళ్ల బాలుడు లైంగికదాడి చేయడం విధితమే. నిందితుడికి సహకరించిన మండలంలోని గండెంపల్లి గ్రామానికి చెందిన బండారు సన్యాసమ్మ (23), బొడ్డపల్లి గ్రామానికి చెందిన యాట్ల చిన్నబ్బాయిరెడ్డి (26) లను ముగ్గురిని రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ అడహళ్లి ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి ముగ్గురిపై ఫోక్సో చట్టప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరపరచనున్నట్టు ఏఎస్పీ తెలిపారు.
[zombify_post]