in , , ,

గుండా సత్తయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించిన మంత్రి

యాదాద్రి భువనగిరి జిల్లా: 

సెప్టెంబర్ 22:

  • రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామంలో సుమధుర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన గుండా సత్తయ్య  మెమోరియల్ ప్రభుత్వ  పాఠశాల భవనంను  ప్రారంభించిన  మంత్రి జగదీష్ రెడ్డి

  • పాల్గొన్న  నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఎమ్మెల్యే పైల్ల శేఖర్ రెడ్డి,  ఫౌండేషన్ చైర్మన్ గుండా మధుసూదన్ గుప్తా.

  • మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్ :

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలు పట్టణాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి.

ఆకలి చావులతో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి తెలంగాణ ఇప్పుడు.. దేశానికి అన్నపూర్ణగా మారింది.

అందుకు అనుగుణంగా రైతులకు విద్యుత్ తో పాటు ఆర్థికంగా సాయం అందించారు.

రాష్ట్ర ప్రభుత్వం చేరుకోలేని చోట సొంత గ్రామాన్ని కొందరు ముందుకు వచ్చి అభివృద్ధి చేయడం సంతోషించదగ్గ విషయం

ఉన్న ఊరి కోసం సేవ చేయాలన్న సంకల్పం కొందరికే ఉంటుంది.

అలాంటి వారిలో మొదటి వరుసలో గుండ సత్తయ్య కుటుంబం ఉంటుంది.

ఈ సందర్భంగా సుమధుర ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి జగదీష్ రెడ్డి

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

ఔషద గుణాలు నల్లేరు… రాజమండ్రి మార్కెట్లో…

బేస్తవారిపేట ఉప సర్పంచ్ రాజీనామా