మైనారిటీ సంక్షేమం లో తెలంగాణ నంబర్ వన్
సబ్బండ వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం
గంగా జమున తేహజీభ్ సంస్కృతికి నిలయం సూర్యాపేట
ఐక్యత, అభివృద్ధిలో దేశానికే సూర్యాపేట ఆదర్శం కావాలి
వచ్చే మూడేళ్లలో.. మెట్రో నగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చి దిద్దుతా: మంత్రి జగదీష్ రెడ్డి
సెప్టెంబర్ 22:
సూర్యాపేట లోని పి. ఎస్. ఆర్ సెంటర్ లోని చిన మజీధ్ సమీపం లో 80లక్షల వ్యయం తో నిర్మించనున్న మైనారిటీ కమ్యునిటీ హాల్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.
మైనారిటీ సంక్షేమం లో దేశంలో నే తెలంగాణ నంబర్ వన్ అని సూర్యాపేట శాసన సభ్యులు,రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.సూర్యాపేట లోని పి.ఎస్.ఆర్ సెంటర్ వద్ద గల చిన మజీద్ సమీపం లో ముస్లీం సోదరుల చిరకాల వాంఛ అయిన మైనారిటీ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు.80లక్షల వ్యయం తో నిర్మించనున్న మైనారిటీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేసిన సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి తప్పా, వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు, వెలుగులు కానరాలేదన్న మంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లీం సోదరుల జీవితాల్లో వెలుగులు నిండాయని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు..షాదీముబారక్, మైనారిటీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, ఇమామ్, మౌజన్‌కు గౌరవవేతనం, హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణలాంటి అనేక కార్యక్రమాలు మైనారిటీల ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చినవేగాక ఇవ్వని హామీలు సైతం అమలు చేస్తూ మైనారిటీ జీవితాల్లో
బీఆర్ఎస్ ప్రభుత్వం వెలుగు నింపుతున్నదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం ప్రత్యేకంగా 206 గురుకులాలు ఏర్పాటు చేసింది. నిరుపేద మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద ఒక్కో మైనారిటీ విద్యార్థికి రూ.20 లక్షలకు పైగా ఇస్తున్నదన్నారు,మైనారిటీలకూ ఆర్థిక భరోసా ఇచ్చేందుకే మైనార్టీ బంధు ను తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలోని అన్ని సామాజికవర్గాల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్ మైనారిటీల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మైనారిటీ బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. అని అన్నారు. గాంధీ కలలు కన్న గంగా జమున తేహజీభ్ సంస్కృతి కి సూర్యాపేటనిలయం గా మారిందన్నారు. ఒకరి మత ఆచారాలను మరొకరు, ఒకరి సంస్కృతుల ను ఇంకొకరు గౌరవించు కుంటూ ఐక్యత, అభివృద్ధి లో దేశానికే సూర్యాపేట ఆదర్శం గా ఉందన్నారు. గత పాలకుల హయాం లో అస్తవ్యస్తమైన శాంతి భద్రతలను తొమ్మిది ఏళ్ల కాలంగా అదుపు లో ఉంచుతూ ప్రశాంత వాతావరణం నెలకొల్పిన నేపథ్యం లో సూర్యాపేట కు వ్యాపార సంస్థలు క్యూ కట్టాయని అన్నారు.వచ్చే మూడేళ్లలో మెట్రో నగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చి దిద్దుతామన్న మంత్రి, ఐటి రంగంలో హైదరాభాద్ తరువాతి స్థానం సూర్యాపేట దే అవుతుందని అన్నారు. కార్యక్రమం లో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ అన్నపూర్ణమ్మ, మౌలానా అత్తర్ సాబ్, గాయాజ్ బాయ్, ఆఫీజ్ ఖాలీల్ సాబ్ ముస్లీం కో ఆప్షన్, మైనారిటీ అధ్యక్షులు రియాజ్, కౌన్సిలర్లు తాహెర్ పాష, జహీర్ , గండూరి రాధిక,షాదీ ఖానా చైర్మన్ సయ్యద్ సలీం, షాహధ్ మౌలానా, అజీజ్, గౌస్ ఖాన్, తాహేర్, గౌస్, నజీర్, తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!