in ,

రెవెన్యూ డివిజన్ కై కదిలిన అఖిలపక్షం నాయకులు.

ఎల్లారెడ్డిపేట ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.

ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ డిమాండ్.

పాత బస్టాండ్ నుండి తహాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ.

కార్యాలయం ముందు ధర్నానిర్వహించిన అఖిలపక్ష నాయకులు.

అనంతరం తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ,  అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం పాత బస్టాండ్ నుండి  తహాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం తహసిల్దార్ రామచంద్రం కు  రెవెన్యూ డివిజన్ సాధన సమితి కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ కన్వీనర్ ఒగ్గు బాలరాజు యాదవ్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలను తక్షణమే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎల్లారెడ్డిపేట గంభీరావుపేట,  ముస్తాబాద్,వీర్నపల్లి మండలాలను కలుపుతూ రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ప్రతి ఒక్క అవసరానికి సిరిసిల్ల జిల్లా కు వెళ్లాల్సి వస్తుందనీ,ఎల్లారెడ్డిపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తే అన్ని విధాలుగా ముస్తాబాద్, వీర్నపల్లి, గంభీరావుపేట మండలాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తే ప్రజలకు దూర భారం తగ్గుతుందని మండలాలు గ్రామాలు అభివృద్ధి పదంలో ఉంటాయని అన్నారు. తక్షణమే మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎల్లారెడ్డిపేట మండలంను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలనీ అన్నారు. లేనిపక్షంలో ఎల్లారెడ్డిపేట మండలంలో రెవెన్యూ డివిజన్ గా చేసేంతవరకు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ,  అఖిలపక్షం ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు  గుండాడి వెంకట్ రెడ్డి,  కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, పందిర్ల లింగం గౌడ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు వర్ధవేల్లి స్వామి గౌడ్,  బిఎస్పి పార్టీ మండల అధ్యక్షులు నీరటి భాను, మండల ఇన్చార్జి లింగాల సందీప్, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,టిడిపి పార్టీమండల సీనియర్ నాయకులు మాలోత్ సూర్య నాయక్ రాజేందర్,రాజు నాయక్,పంజా సంపత్,ఒగ్గు మహేష్ యాదవ్,అంజయ్య, లక్ష్మీరాజం, రాజు, కిషన్, చిరంజీవి, సాయి చందు, శ్రీనివాస్,గుర్రపు రాములు, దూస శ్రీనివాస్,మానుక కుమార్,అఖిలపక్ష పార్టీల నాయకులు,  వివిధ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.రెవెన్యూ డివిజన్ కై కదిలిన అఖిలపక్షం నాయకులు.

 

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

గెస్ట్ లెక్చ‌ర‌ర్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్‌

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు శాంతారెడ్డికి సన్మానం