in ,

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు శాంతారెడ్డికి సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన అత్తునూరి శాంతారెడ్డిని శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. వైరాలోని హైస్కూల్ పోస్టింగ్ అయినా డిప్యూటేషన్ పై సత్తుపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శాంతారెడ్డి పనిచేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై సత్తుపల్లి పేర ప్రఖ్యాతలు పెంచారని వక్తలు అన్నారు. విద్యార్థులు తనపై ఉంచిన నమ్మకం, ప్రేమ, క్రమశిక్షణ తనను ఈ అవార్డుకు అర్హుడిని చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పూరేటి యాకోబు. ఉపాధ్యాయులు మురళీమోహన్, షాకీర్ హుస్సేన్, ఆదిశేషు, విమల, రవీందర్, రహీమ్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

రెవెన్యూ డివిజన్ కై కదిలిన అఖిలపక్షం నాయకులు.

పోరాడితే పోయేదేమీ లేదు- బానిస సంకెళ్లు తప్ప