in ,

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలలో వణుకు మొదలైంది

భావిప్రధాని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి జోడో యాత్ర చేసిన సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో-చైర్మన్ ఖమ్మం జిల్లా మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు దేశాన్ని ఐక్యం చేయుట కొరకు రాహుల్ గాంధీ గారు చేపట్టారు. భారత్ జోడో యాత్రకు నేటితో సంవత్సరం పూర్తి చేసుకొన్న సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుధాకర్ అధ్యక్షతన బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నుండి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి హాథ్ సే హాథ్ జోడో యాత్ర మన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వరకు చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ హస్తమే దేశ భవితకు అభయ హస్తమని చాటుతూ, విద్వేషంతో నిండిన బీజేపీ, BRS నియంతపాలన వారి కుతంత్రాలను బయటపెడుతూ రాష్ట్ర, దేశ ప్రజల ప్రేమను కోరుతూ, దేశ సమగ్రత కొరకు అగ్రనేత, భావి ప్రధాని రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగు వేల కిలమీటర్లు భారత్ జోడో యాత్ర చేపట్టి చరిత్ర సృష్టించారని తెలిపారు. 

ఈ యాత్ర ద్వారా బీజేపీ, BRS పార్టీలలో వణుకు మొదలైందని అలాగే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపు వారి యాత్ర ఫలితమేనని త్వరలో తెలంగాణలో కూడా ఇదే పునరావృతం అవుతుందని తెలిపారు. అందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

[zombify_post]

Report

What do you think?

గిరిజన తండాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు

మొక్కజొన్న పంటను వేసి ..పూర్తిగా నష్ట పోయిన పోయిన రైతన్నలు..