సత్తుపల్లి మండల కేంద్రంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో జవహర్ నగర్ లోని శ్రీ కృష్ణ దేవలయంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఉట్టికొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ ప్రాంగణంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీ కృష్ణ దేవాలయ కమిటీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకి శ్రీ కృష్ణుడి చిత్రపటాన్ని బహూకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మహేష్,జిల్లా గ్రంధాలయ సంస్థల చైర్మన్ కొత్తూరు ఉమా మహేశ్వర రావు, ఆత్మా కమిటీ చైర్మన్ వనమా వాసుదేవరావు పాల్గొన్నారు.
[zombify_post]