కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర చేపట్టి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గురువారం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీపార్క్ లోని బాపూజీ విగ్రహానికి, మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మినీ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, విభజన రాజకీయాలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, చైనా దురాక్రమణలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర కొనసాగించారని అన్నారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు జునైద్ మెమన్, నాయకులు అర్జుమాన్ అలీ, నందెడపు చిన్నూ, ఎంబడి రాజేశ్వర్, సబా కలీమ్, మతీన్, మెయిన్, రాకేష్, మాజర్, గణేష్, ప్రతాప్ రెడ్డి, రాంరెడ్డి,సలీం, రాజేశ్వర్ గంగాధర్ తదితరులు పాల్గున్నారు.
[zombify_post]