అల్లూరి సీతారామరాజు జిల్లా లో మొత్తం 7.28 లక్షల మంది ఓటర్లు ఉన్నారని జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్ తెలిపారు. గురువారం ఆయన పాడేరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు తో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 7 లక్షల 6 వేల 267 మంది ఓటర్లు వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. పాడేరు నియోజకవర్గం లో 2 లక్షల 30 వేల 90 ఓటర్లు, అరుకులోయ నియోజకవర్గం లో 2 లక్షల 29వేల 580 ఓటర్లు, రంపచోడవరం నియోజకవర్గంలో 2లక్షల 68 వేల 848 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 3848 మంది ఓటర్లు మృతి చెందగా 48 నకిలీ ఓటర్లను గుర్తించామని తెలిపారు. జిల్లా లో 97 శాతం ఓటర్ల వెరిఫికేషన్ జరిగిందని చెప్పారు.
[zombify_post]