డబ్బు ఉన్న వాళ్లకే దళిత బంధు ఇతర ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన సంఘటన సత్తుపల్లి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లి గ్రామంలో జాతీయ రహదారి పై మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో సుమారు 400మందికి గాను కేవలం 8మందికే దళిత బందు పథకంలో పేర్లు నమోదు చేశారని ఆగ్రహంచారు. మహిళలందరూ రోడెక్కి ఆందోళన చేశారు. గ్రామంలో ఉన్న దళితులందరికి దళిత బందు వర్తించేలా చేసి న్యాయం చేయ్యాలని రోడ్డు పై బైఠాయించారు. రహదారిపై బైఠాయించడంతో తల్లాడ టు దేవరపల్లి జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ కావటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న వీ.ఎం.బంజర్ పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి నచ్చజేప్పి ఆందోళనను విరమింపజేశారు.
[zombify_post]