in ,

ఓటర్ నమోదుకు ప్రోత్సహించాలి

– ఖమ్మం కలెక్టర్ వి.పి.గౌతమ్

ఓటర్ నమోదుకు ప్రోత్సహించాలని, అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ దిశగా ఓటర్ నమోదుపై యువతకు ప్రేరణ కల్పించేలా పోస్టర్లు, వీడియోల రూపకల్పనకు ఆసక్తిగల వారి నుండి ఎంట్రీలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆహ్వానిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. పోస్టర్లు, వీడియోలు ప్ర జలను ఓటర్ లిస్ట్ ను తనిఖీ చేసేవిధంగా ప్రోత్సహించాలని, టార్గెట్ యువతకు సులభ రీతిలో అర్థమయ్యేలా ఉండాలని, తెలుగు, హిందీ, ఆంగ్ల, ఉర్దూ భాషల్లో రూపొందించవచ్చని ఆయన తెలిపారు. జేపేగ్/ పీఎనీ ఫార్మాట్లో 5ఎంబికి దాటకూడదని, వీడియో నిడివి 60సెకన్లు దాటకూడదని ఆయన అన్నారు. ఎంట్రీల్లో రాజకీయ అర్థాలు వచ్చే గుర్తులు, రంగులు, నాయకులు తదితరాలు ఉంటే తిరస్కరణకు గురవుతాయని ఆయ తెలిపారు. ఉత్తమ ఎంట్రీ విజేతలకు రూ.20వేల నగదు బహుమతి ఇస్తారని ఆయన అన్నారు. ఎంట్రీలు https://tinyurl.com/electioncrea2023 కి ఈ నెల 16లోగా అందాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

[zombify_post]

Report

What do you think?

బీటీ రహదారులకు రూ.95.53 కోట్లు

కేసీఆర్ ప్రత్యేక దృష్టితోనే సీతారామ ప్రాజెక్టు