పాడేరు నియోజకవర్గం, అల్లూరి సీతారామరాజు జిల్లా: గూడెం కొత్త వీధి మండలంలోని
పీట్రాయి నుంచి ఒరిస్సా సరిహద్దు వరకు రూ.60 లక్షలతో జీఎస్పీ రోడ్డు నిర్మాణ పనులకు శాసనసభ్యులు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి పనుల ప్రారంభించిన అనంతరం భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తున్నారని ప్రతిపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎన్ రాజు, ఎం పి టి సి ఎం.రామన్న పిలా బుజ్జి, జి రామయ్య, పి సాంబమూర్తి, మండల ప్రెసిడెంట్ బొబ్బిలి లక్ష్మణ్, ఎంపీపీ బోయిన కుమారి, ఏఎంసీ చైర్మన్ ఎం మత్స్యరాజు, సర్పంచులు ఎం కమలమ్మ, పి దుర్గా, పి వంశీకృష్ణ , కె రాంబాబు, ఎంపీటీసీలు ఎం సత్యనారాయణ, పి నాగమణి, పీలా సాంబమూర్తి, సిహెచ్ ఆనంద్ (వైస్ ఎంపీపీ) సీనియర్ నాయకులు కే గిరిప్రసాద్, కే రామ్ రాజ్, ఆర్ మోహన్ రావు , అంజి లోవరాజు, సోషల్ మీడియా కన్వీనర్ అల్లాడ నగేష్, పి ఎస్ ఎస్ చైర్మన్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]