టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర పై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు చేయడం దారుణమని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అనచనారు. బుధవారం ఆమె అనకాపల్లి జిల్లా పాయకరావుపేట లో మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు టిడిపి నాయకులపై దాడులకు తెగపడుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తె వైసీపీ నాయకులు భరతం పడతామని ఆమె హెచ్చరించారు. వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడినా టీడీపీ సమన్వయం పాటిస్తుందని అన్నారు.
[zombify_post]