వర్షా బావ పరిస్థితుల కారణంగా వరి నాట్లు పూర్తిస్థాయిలో వేయలేదని,వేసిన వరి నాట్లు ఎండిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయని కనుక గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని కరువు మండలాలను గుర్తించాలని అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కార్యదర్శి వంకల. మాధవరావు డిమాండ్ చేశారు. బుధవారం మందస మండలం హరిపురం మార్పు గ్రంథాలయంలో అఖిల భారత రైతు కూలీ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వంకల మాధవరావు మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభమైందని,సెప్టెంబరు మొదట వారం పూర్తవుతున్నా ఇప్పటివరకు జిల్లాలో 75% మాత్రమే వరి నాట్లు పడ్డాయని తెలియపరిచారు.వంశధార, నాగావళి, బహుద పరివాహక ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల వరి నాట్లు వేయలేదన్నారు.కొన్నిచోట్ల ఎదలు వేసిన నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు.భూమి పగుళ్ళు వీడుతుందని,అధికారులు ముందుచూపుతో వంశధార కాలువలకు మరమ్మతుల పూర్తి చేసి ఉంటే చివర భూములకు కనీసమైన నీరు వచ్చేదన్నారు.వాస్తవానికి నీటి సామర్థ్యం ఉపయోగించుకోవడంలో మినీ రిజర్వాయర్లు కట్టడంలో సాగునీటి ప్రాజెక్టు అభివృద్ధి చేయడంలో వంశధార కాలువ ఇచ్చాపురం వరకు పొడిగించడంలో పాలకులకు దృష్టి లేదని మండిపడ్డారు. మందస మండలంలో సంకుజోడు,కలింగదళ్ ,డబార్సింగ్ వంటి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి ఆయకట్టు రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.పలాస డివిజన్ బాగా వర్షపాతం తక్కువగా నమోదయిందని,సగటు కంటే వర్షపాతం బాగా తక్కువగా నమోదవడంతో కరువు పరిస్థితులు కనబడుతున్నాయన్నారు . గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని కరువు బాధిత మండలాలను గుర్తించాలని,రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని,ఆరుతడి పంటలకు కావలసిన విత్తనాలు మెట్టు పంటలకు కావలసినటువంటి విత్తనాలును,ఎరువులను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంశధార ఎడమ కాలువ ఇచ్చాపురం వరకు పొడిగించాలని, ఆఫ్ షోర్ రిజర్వాయర్ యుద్ధ ప్రతిపాదించిన పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులు భైరి కుర్మారావు, మామిడి భీమారావు, ఐ ఎఫ్ టి యు నాయకులు జుత్తు వీరస్వామి సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]