ఎన్టీఆర్ జిల్లా నందిగామ:
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసే ఎన్నికలకు వెళ్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం ఒక శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు.
నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య గురువారం నాడు రాత్రి తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ,జనసేన పార్టీ పొత్తు పై హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటనలో మాట్లాడుతూ..
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల *పొత్తు* అత్యంత అవసరమని తెలిపారు.
రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం
వైసీపీ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎదుర్కోవాలంటే పొత్తు తప్పదని తెలిపారు.
ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలన్నదే ఇరు పార్టీల పొత్తు ఆకాంక్ష అని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చెప్పారు.
[zombify_post]