నర్సీపట్నం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైఅలర్ట్ ప్రకటించారు. దీనిలో భాగంగా మాజీమంత్రి సిహెచ్.అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున హౌస్ అరెస్టు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయన ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే పలు తెదేపా నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గొలుగొండ మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు ఆడిగర్ల అప్పలనాయుడిని ఎస్ ఐ నారాయణ రావు అదుపులోకి తీసుకొని హౌస్ అరెస్టు చేశారు.కాగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రమంతా హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
[zombify_post]