జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ జిల్లా యువజన అధ్యక్షులు బొల్లె అనిల్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ సారంగాపూర్ ఇన్చార్జి మీసాల సాయిలు, జిల్లా అధికార ప్రతినిధి ధూమాల పెద్ద గంగారం మరియు 50 మంది కార్యవర్గ సభ్యులు, మోరపల్లి గ్రామ పద్మశాలి సంఘం అధ్యక్షులు దీకొండ రమేష్ ఆధ్వర్యంలో 15 మంది కార్యవర్గ సభ్యులు, గ్రామానికి చెందిన వడ్డెర సంఘం అధ్యక్షులు గోపాల్ అధ్వర్యంలో 20 మంది కార్యవర్గ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం గ్రామశాఖ మాజీ అధ్యక్షులు బేతి రాజిరెడ్డికి మంజూరైన 1,50,000 సీఎం సహాయని చెక్కును అందజేసిన ఎమ్మెల్యే.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగారాం,దావా సురేష్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,జిల్లా రైతు బందు సమితి సభ్యులు కట్ట రాజేందర్,కమలాకర్ రావు,గ్రామ శాక అధ్యక్షులు రాజీ రెడ్డి,యూత్ అధ్యక్షులు తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.