ముప్పై కొట్లతో ఉమ్మడి కొత్తగూడ మండలానికి సాగు నీరు
ములుగు నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు బిఆర్ఎస్ కు మాత్రమే వుంది
గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనేతరుల భూ సమస్యను బిఆర్ఎస్ ప్రభుత్వంమే పరిష్కరిస్తుంది
ఉమ్మడి కొత్తగూడ మండలాల కార్యకర్తలా సమావేశం లో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై. సతీశ్ రెడ్డి
కొత్తగూడ /మహబుబాబాద్ : ఉమ్మడి కొత్తగూడ మండలాలకు రెండు పంటలకు,సాగు నీరు అందించేందుకు పాఖాల చెరువు నుండి ముప్పై కొట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు అందిస్తామనీ ,ఇందుకు కావలసిన ప్రణాళికలు ,నివేదికలు పూర్తీ అయ్యాయని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై. సతీశ్ రెడ్డి అన్నారు .మంగళవారం నాడు బత్తులపెల్లి లో రాష్ట్ర ఉద్యోగుల సంఘం నాయకులు ఈసం స్వామీ ఇంటి అవరణం లో జరిగిన కొత్తగూడ ,గంగారం మండలాల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యా అతిధులుగా తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై. సతీశ్ రెడ్డి,ములుగు అసెంబ్లీ అభ్యర్థి బడే నాగజ్యోతి లూ హజరయ్యారు .కొత్తగూడ మండల పార్టీ అద్యక్షులు కొమ్మనబోయిన వేణు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశం లో తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ వై. సతీశ్ రెడ్డి మాట్లడుతూ గత నాలుగు ఏళ్ళనుండి సీతక్క కు కేటాయించిన సి డిఎఫ్ నిదులు దాదాపూ ఇరవై కొట్ల రూపాయలతో ఎం చేశారని ,గిరిజన ప్రాంతాలల్లో గిరిజనుల అభివృద్దికి కృషి చేసింది సీఎం కెసిఆర్ అని ,సీతక్క తల్లీదండ్రులకు కుడా పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని ,కొత్తగూడ మండల కేంద్రం లో ఉన్న పిహెచ్సీ నీ సిహెచ్సి గా అప్గ్రేడ్ చేయుటకు కృషి చేస్తానని ,పోడు పట్టాలు అందుకున్న రైతులకు విద్యుత్ ఇవ్వడానికి సర్కారు సిద్ధంగా ఉందని కావలసిన రైతులు దరఖాస్తులు చేసుకొవాలని ,కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటిలు అమలు చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రి అభ్యర్థి ఎవరొ మొదట ప్రకటించాలని డిమాండ్ చేశారు .గిరిజన ప్రాంతాలల్లో నివసిస్తున్న గిరిజనేతరుల భూ సమస్యను కెసిఆర్ దృష్టి కి నాగజ్యోతి తీసుకెళ్లగా ..త్వరలొ ఈ సమస్యను పరిష్కరిస్తామని సీఎం కెసిఆర్ హమీ ఇచ్చారని ,రానున్న ఎన్నికలల్లో బడే నాగజ్యోతిని అసెంబ్లీ కి పంపి కెసిఆర్ రుణాని తీర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు .ఈ కార్యక్రమం లో పోరిక గోవింద్ నాయక్ ,ఈసం కమలమ్మ ,కాంతమ్మ , మండల అదికార ప్రతినిథి నెహురు నాయక్ ,సురయ్యా ,సమ్మయ్య ,సంతోష రాణి ,రమేశ్ ,ప్రశాంత్ ,శ్రీను ,రాజు ,తదితరులు పాల్గొన్నారు .
This post was created with our nice and easy submission form. Create your post!