in , , , ,

పెండింగ్ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలి: మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట సమీకృత కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారుల సమీక్షలో మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి.

పెండింగ్ పనులన్నీ తక్షణమే పూర్తి చేయాలి-మంత్రి జగదీష్ రెడ్డి

 సూర్యాపేట కలెక్టరేట్లో అభివృద్ధి పనుల పురోగతిపై అన్ని శాఖల అధికారులతో మంత్రి సమీక్ష

సూర్యాపేట సెప్టెంబర్ 21:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలాన్ని తక్షణమే అరులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా ప్రభుత్వ యంత్రాంగాన్ని  ఆదేశించారు. గురువారం రాత్రి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన  ఛాంబర్ లో  అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ , మున్సిపల్ కమీషనర్, పంచాయితీ రాజ్, రెవిన్యూ జిల్లా అధికారులు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ డివిజన్ ఇంజినీర్స్ తో  పాటు అన్ని శాఖ ల అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్అండ్ బి చేపట్టినరహదారుల పెండింగ్ పనులను త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని  సూచించారు.

గృహలక్ష్మి దరఖాస్తులను పరిశీలించి  లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణి చేయాలని కోరారు. జి.ఓ.59 పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి పట్టాలు అందజేయాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధి లో సిసి రహదారులు, ఆధునికరణ పనులను వారం  లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్ లతో పాటు, అన్ని ప్రభుత్వ శాఖ లలో పెండింగ్ పనులను యుద్ద ప్రాతిపాదికన పూర్తి చెయ్యాలని మంత్రి ఆదేశించారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

రిమాండ్ ఖైదీ జైల్లో మరణించలేదు

క్రీడ రంగాన్ని అభివృద్ధి చేయాలి”