దివ్యాంగులకు ప్రభుత్వం సంపూర్ణ సహకార అందించి, వారికి అండగా నిలుస్తుందని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సోమవారం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్ లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా – అలీమ్ కో వారి ఆద్వర్యంలో
0 నుండి 18 సంవత్సరాల మద్య వయస్సు గల 175 మంది వికలాంగులకు ఉచిత ఉపకరణాలను రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, పిల్లలు దైవంతో సమానమని వారి వైకల్యం బాధను కలిగించిన, వారిని దైవుడిచ్చిన వరంగానే భావించాలన్నారు. శరీరంలోని అవయవాలు, మానసింగా బాగా లేనివారిని కాదు, అన్ని సక్రమంగా ఉండి మనస్సు మంచిగా లేని వారినే నిజమైన అంగవైకల్యులుగా భావించలన్నారు. వైకల్యంతో ఉన్న పిల్లల తల్లితండ్రులు ఎప్పటికైన వారు వైకల్యాన్ని జయిస్తారనే మనోదైర్యాన్ని కలిగి, పిల్లలకు కల్పించినప్పుడే మంచి ఫలితాలను సాధించగలుగుతారని అన్నారు. దైర్యాన్ని మించింది మరోకటి ఉండదని, క్యాన్సర్ అనగానే భయపడే వారు, ఇప్పుడు అందిస్తున్న వైద్యంతో 60-70 శాతం మంది బయటపడ్డవారు కూడా ఉన్నారని, దీనిని స్పూర్తిగా మనోదైర్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా ప్రభుత్వం అండగా ఉంటు వారికి పూర్తి సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షా కరీంనగర్ వారి ఆద్వర్యంలో అలీమ్ అండ్ కో ద్వారా సరఫరాల చేయబడిన 28 రోలేటర్ లు, ట్రై వీలర్ సైకిళ్లు4, ఎల్బో క్రచెస్10, 55 యం ఎస్ ఐ డి కిట్ లు55, వీల్ చైర్లు36 సిపి వీల్ చైర్లు31,సుగమ్య కెన్ లు 10, వినికిడి పరికరాలు 37 మొత్తం 211 ఉపకారణాలను పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు,జిల్లా పరిషత్ చైర్ పు పర్సన్ కనుమల్ల విజయ జిల్లా కలెక్టర్ డాః బి. గోపి,జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు , డిడబ్లుఓ సరస్వతి,విద్యా శాఖ అధికారులు ఆంజనేయులు,కార్పొరేటర్,ఇతర అధికారులు, పిల్లల తల్లితండ్రులు పాల్గోన్నారు.
[zombify_post]