in , , ,

మైనారిటీ బంధు కాదు..గంగుల బంధు -అంబటి జోజి రెడ్డి

కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా, టిఆర్ఎస్ మైనారిటీ నాయకులకే లోన్లు వచ్చాయని, ముఖ్యంగా  కరీంనగర్ టౌన్ లో 164లో..  దాదాపు 114 మంది బీఆర్ఎస్ మైనారిటీ నాయకులకు, కార్యకర్తలకు, మిగతావి ఎంఐఎం కార్పొరేటర్ల అనుచరులకే మైనార్టీ బందు లోన్లు ఇచ్చారని, పేద ముస్లింలకు మొండి చేయి చూపించారని, ఇది మైనారిటీ బందు కాదు మంత్రి గంగుల కమలాకర్ కు గులాంగిరి చేసే వాళ్ల బంధు అని చెప్పుకోవచ్చని, మైనార్టీ బందు కాస్త బీఆర్ఎస్, ఎంఐఎం ఫ్రెండ్లీ ఫెవికాల్ ఎలక్షన్ బంధంగా మారిందని ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ప్రభుత్వ అక్రమ పాలసీ విధానంపై ధ్వజమెత్తారు. సోమవారం జోజిరెడ్డి ప్రెస్ మీట్ లో  మాట్లాడుతూ రెక్కలు ముక్కలు చేసుకొని,  లోన్లు వస్తాయని, కేసీఆర్ ప్రభుత్వ ప్రకటనతో, కోటి ఆశలతో వందల రూపాయలు ఖర్చు పెట్టి మైనార్టీ సబ్సిడీ లోన్ల కోసం పేద ముస్లింలు దరఖాస్తులు చేసుకుంటే ప్రభుత్వం ఇస్తుందనుకున్నా మైనారిటీ లక్ష రూపాయల సబ్సిడీ లోన్ కాస్త బిఆర్ఎస్ పార్టీ నాయకులకు వరంగా మారింది. 100% సబ్సిడీ లక్ష రూపాయలు అర్హులు కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులే..మన మున్సిపల్, ఎంపిడివో శాఖల అధికారులకు, మరియు ప్రభుత్వ పెద్దలకు కనిపించడం హాస్యాస్పదంగా మారింది. అయినా లోన్లు వచ్చిన బీఆర్ఎస్ వాళ్లు పేదలేనా..? ఇది నిరూపిస్తారా.. వీళ్ల కంటే దరఖాస్తులు చేసిన వాళ్లలో పేదలు లేరా..? ఇది అధికారులకు కనిపించడం లేదా..మంత్రి ఏది చెబితే అదే చేస్తారా.. రాజకీయంగా పలుకుబడి ఎవరికి ఉంటే వాళ్లకే, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చినప్పుడు, మరి దరఖాస్తులను ఇతర పేద ముస్లింల నుండి ఎందుకు స్వీకరించారని ప్రశ్నించారు. ఆనాడే కేవలం బిఆర్ఎస్ పార్టీ నాయకులకే  ఈలోన్లను ఇస్తామని చెప్పి ఉంటే, ప్రకటించి ఉంటే, ఏఒక్క ముస్లిం కరీంనగర్ లో, తెలంగాణ వ్యాప్తంగా వందలాది రూపాయల ఖర్చుపెట్టి లోన్ల కోసం దరఖాస్తులు చేసేవాళ్లు కాదన్నారు. స్థానిక ఎమ్మెల్యే.. మంత్రి అయిన గంగుల కమలాకర్ కు ఊడిగం చేస్తూ..ఇంటి ముందు కాపలా ఉండే బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులకు, ఎంఐఎం కార్పొరేటర్ల అనుచరులకు, వాళ్ల బంధువులకు మాత్రమే లోన్లు వచ్చాయన్నారు. దీనిని సమాచార హక్కు చట్టం ద్వారా బహిర్గతం చేస్తామన్నారు ఎవరు అడిగినా ఆర్టిఏ ద్వారా ఎవరు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టిన వారికి సమాచారం ఇవ్వద్దని సంబంధిత అధికారులకు బిఆర్ఎస్ నాయకులు హుకుం జారీ చేశారని ఆరోపించారు. అన్ని బీఆర్ఎఎస్ పార్టీ, ఎంఐఎంపార్టీ నాయకులు తీసుకుంటే ఇక ప్రభుత్వం దరఖాస్తులు పేద ప్రజల నుండి స్వీకరించారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంవత్సరం నాలుగు లోన్లు వచ్చేవి.. కానీ అవి రాజకీయ పలుకుబడి లేకుండా వచ్చేవన్నారు. గడచిన 9 ఏండ్ల లో ముస్లింలకు ఇప్పుడిచ్చే దానితో రెండోసారి మాత్రమే సబ్సిడీ లోన్లు ఇస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలపై, బీఆర్ఎస్ ప్రభుత్వం..ముస్లింలు నాదాన్..కమ్ జోర్ గా భావించి వీళ్లు ఏమి చేయలేరనే అహంకారంతో..ముస్లింలను ఆర్థికంగా, విద్యా, ఉద్యోగాల పరంగా పైకి రాకుండా ఎలా అణచివేస్తోందో.. ఏవిధంగా సవతితల్లి ప్రేమను ఒలకబోస్తూన్నదో..అందులోనూ ఈసారి ఇస్తున్న మైనారిటీ లోన్లు కేవలం బిఆర్ఎస్ పార్టీలో మైనార్టీ నాయకులుగా రోజూ చలామణి అయ్యే వారి పేర్ల మీద రావడం విడ్డూరంగా ఉంది. ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారి పేర్ల మీద రావడం ఏమిటీ..? అదే బీఆర్ఎస్ లీడర్లు కాకుండా కరీంనగర్ పట్టణంలోని పేద ముస్లింలకు వస్తే అందరం సంతోషించే వాళ్ళం. గత కొద్ది సంవత్సరాలుగా మంత్రి గంగుల పై.. నారాజ్ గా ఉన్న ఈ మైనార్టీ నాయకులను సంతోష పెట్టడానికి, ఇప్పుడు ఈ లోన్లను ఇచ్చి రాబోయే ఎలక్షన్ పని చేయించుకోవడం కోసం చేసే కుట్రనే మైనార్టీ బంధు పథకం స్కీం ఉద్దేశమన్నారు. ఎన్నికల ముందు పేద ముస్లింల పేరిట మైనార్టీ బంధును లోన్ల పేరిట సృష్టించి, బిఆర్ఎస్ మైనార్టీ నాయకులకు ఇచ్చి, వారిని మచ్చిక చేసుకొని, సంతోష పెట్టి, అసెంబ్లీ ఎలక్షన్లలో, చెంచాగిరి పని చేయించుకోవడమే మైనార్టీ బంధు స్కీం లక్ష్యమన్నారు. ఇక ఇదే మొఖా గా, పనిలో పనిగా, బీఆర్ఎస్ నేతల లూపోల్స్ ను, వారి కంజోరీనీ పసిగట్టి, బీఆర్ఎస్ నేతలతో చేయి కలిపి, కరీంనగర్ మైనార్టీ ఫైనాన్స్ కార్యాలయంలో పని చేస్తున్న ఒక జూనియర్ అసిస్టెంట్ సైతం 6లోన్లను తన దగ్గరి వాళ్ళకు ఇప్పించుకున్నడంటే పెచ్చరిల్లిన అవినీతి కరీంనగర్ లో.. ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే తెలంగాణ లో.. బీఆర్ఎస్ పార్టీకో..కరీంనగర్ లో మంత్రి గంగులకు హటావో.. తెలంగాణకో..కరీంనగర్ కో.. బచావో అనే నినాదంతో ముస్లింలు బి ఆర్ ఎస్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలన్నారు. బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ వచ్చాక అత్యధికంగా నష్టపోయింది ముస్లిం లేనని, ఇదే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ముస్లింలను మచ్చిక చేసుకుని లక్ష రూపాయల లోన్ల పేరిట, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులకి ఇచ్చి మోసం చేస్తున్న విధానాన్ని తెలుసుకోండి మరొకసారి టిఆర్ఎస్ వస్తే మన ముస్లింల జీవితాలు ఎలా ఉంటాయో పసిగట్టాలని పిలుపునిచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Gopi

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆందోళన

అంబుగాం బొడ్లూరు ప్రాథమిక పాఠశాలలో దర్యాప్తు