కరీంనగర్ జిల్లాలోని ప్రజాసమస్యల పరిష్కారం దిశగా నిర్వహంచిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా 145 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. గోపి తెలిపారు.
సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 145 మంది నుండి ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాః బి. గోపి తెలిపారు. సమస్యల పరిష్కారం కొరుతూ వచ్చే అర్జీదారుల ద్వారా వారి సమస్యలను గురించి తెలుసుకుంటు, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 145 ఫిర్యాదులను స్వీకరించగా అందులో కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 15, జిల్లా పంచాయితి కార్యాలయానికి 11, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ కార్యాలయానికి 10, తహసీల్దార్ కొత్తపల్లి కార్యాలయానికి 09 ఫిర్యాదులు రాగా మిగిలిన శాఖలన్నింటికి కలిసి 100 ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లక్ష్మీకిరణ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ ఆర్డిఓ కె. మహేష్ వివిద శాఖల అధికారులు పాల్గోన్నారు.
[zombify_post]