కరీంనగర్ జిల్లాలో అర్ధరాత్రి ఆశా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోమవారం ఆశ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాలు పాల్గొంటారని సమాచారం మేరకు పోలీసులు ఆశా కార్యకర్తలను ఎక్కడకక్కడ అరెస్టు చేశారు. ఆశా కార్యకర్తల అరెస్టు పై స్పందించిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ రాత్రిపూట ఇంటికి వచ్చి మహిళలైన ఆశ కార్యకర్తలను అరెస్టులు చేయడం చాలా సిగ్గుచేటు అని పేర్కొన్నారు
[zombify_post]