మండలంలోని సంకిలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు చేపల చెరువులోకి దూసుకువె ళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. పాల కొండ నుంచి వస్తున్న కారు సంకిలి సా యిన్నగెడ్డ దాటిన తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చేపల చెరువులోకి దూసుకువెళ్లింది
చెరువులోకి దూసుకువెళ్లిన కారు
రేగిడి: మండలంలోని సంకిలి వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారు చేపల చెరువులోకి దూసుకువె ళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. పాల కొండ నుంచి వస్తున్న కారు సంకిలి సా యిన్నగెడ్డ దాటిన తర్వాత అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చేపల చెరువులోకి దూసుకువెళ్లింది. చెరువు నిండా నీటితో ఉంది. అయితే కారులో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడ్డారు. మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. వీరు పాలకొండ మండలం గోపాలపురం వాసులుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన జరిగిన కొద్దిగంటల్లో క్రేన్ సహాయంతో కారును బయటకు తీసేశారు. ఈప్రమాద ఘటనపై తమకు సమా చారం లేదని ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.
[zombify_post]