తిరువూరు గ్రామ వాలంటీర్ జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. తిరువూరు మూడవ వార్డుకు చెందిన గ్రామ వాలంటీర్ నీలపాల మహిత డెంగ్యూ జ్వరం లక్షణాలతో కొద్ది రోజులుగా చికిత్స పొందుతోంది. కాగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె వున్నారు. మహిత మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సహచర వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగులు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
[zombify_post]