సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుంటున్న ఎంపీపీ
- ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీపీ
- ఆదర్శ పాఠశాలను సూర్యాపేట మండల పరిషత్ అధ్యక్షులు బీరవోలు రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సూర్యాపేట సెప్టెంబర్ 21:
సూర్యాపేట మండల పరిధిలోని ఇమాంపేట ఆదర్శ పాఠశాలను మండల పరిషత్ అధ్యక్షులు బీరవోలు రవీందర్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను తీసి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. నాణ్యమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు తెలిపారు.ఉపాధ్యాయుల తో మాట్లాడి ప్రతిరోజు భోజనాన్ని పరిశీలించాలని తెలియజేశారు. పాఠశాలలో వెనుకబడిన విద్యార్థుల పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారితోటి విద్యార్థుల వలె చదువులో ముందు ముందుండేలా ప్రత్యేకమైన శ్రద్ధ చూపాలని కోరారు
ఉపాద్యాయులు సమయానికి పాఠశాలకు హాజరు కావాలని సూచించారు.పరీక్షలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్ధగా విని నేర్చుకోవడం ద్వారా పాఠ్యాంశ విషయం అవగాహన అవుతుందని విద్యార్థులకు తెలిపారు. చదువులో రాణిస్తూనే క్రీడల్లో కూడా ముందుండాలని అన్నారు. క్రీడలు మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఇస్తాయని తెలియజేశారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తనతో పాటు శంకర్ నాయక్ తదితర ఉపాధ్యాయులు ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!