-
మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-
455 మందికి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ.
-
–రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి.
సూర్యాపేట సెప్టెంబర్ 22:
ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట కండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో సూర్యాపేట నియోజక వర్గ పరిధిలోని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ సంబంధించిన 455 మంది లబ్ధిదారులకు చెక్కులు అందచేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఆడపిల్ల బరువు కాదని..సృష్టికి మూలమని, రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను అన్ని రంగాలలో రాణించేందుకు ఒక విజన్ తో పనిచేస్తున్నారని మహిళ సాధికారతకు, అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మహిళల అభిరుచి మేరకు పథకాలు రూపొందించి రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తుందని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు.
గత పాలకుల అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ప్రజలు గ్రహిస్తున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లాలో త్రాగునీరు, సాగు నీరు, విద్యుత్ గోసలు పడ్డ కష్టాలు ఈ సందర్బంగా గుర్తు చేశారు. సాధించి తెచ్చుకున్న తెలంగాణలో పల్లెలు, పట్టణాలలో అభివృద్ధి కల్పించడంతో ఎంతో ప్రగతిలో నడుస్తున్నాయని అన్నారు. వ్యవసాయ రంగంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు నీరు సమృద్ధిగా ఉండడంతో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించామని అన్నారు. మహిళలకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, ఆరోగ్య మహిళ, కెసిఆర్ కిట్, అమ్మ ఒడి, ఒంటరి మహిళ పింఛన్లు, వితంతు పింఛన్లు, మరెన్నో అద్భుత పథకాలు అందిస్తుందని అన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రం లో కూడా ఈ పథకాలు మహిళలకు అందడం లేదని మంత్రి తెలిపారు.
సూర్యాపేట మండలానికి చెందిన 243, చివ్వేంల 68 మందికి, పెన్ పహాడ్ 100 మందికి, ఆత్మకూరు యస్ కి చెందిన 44 మొత్తం 455 మంది లబ్ధిదారులకు రూ. 1,00,116 గల చెక్కులు లబ్ధిదారులకు అందచేసి శుభాకాంక్షలు తెలిపారు. సూర్యాపేట నియోజక వర్గంలో ఇప్పటివరకు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పధకం కింద లబ్ధిదారులకు రూ. 96 కోట్ల 57 లక్షల రూపాయల గల చెక్కులను లబ్ధిదారులకు అందించామని అన్నారు. గతంలో వలసలు ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి వలన రాష్ట్రంలో 35 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అన్నారు. పట్టణంలో డి.మార్ట్, వస్త్ర దుకాణాల ద్వారా దాదాపు 500 మంది కి ఉపాధి కలిగిందని ఈ సందర్బంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ, ఆర్.డి.ఓ వీర బ్రహ్మ చారి,, ఎంపిపి బీరవోలు రవీందర్ రెడ్డి,జడ్పీటీసీ జీడీ బిక్షం, తహశీల్దార్లు శ్యామ్ సుందర్ రెడ్డి, మహీందర్ రెడ్డి, కృష్ణయ్య, రంగారావు, ప్రజా ప్రతినిధులు,లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!