in , , ,

ఓబిసి బిల్లు అమలు చేయాలి

డాక్టర్ రామ్మూర్తి యాదవ్, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షురాలు ఊర గాయత్రి.

  • పార్లమెంటులో మహిళా రిజర్వేషన్  బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం.

  • ఎన్నో సంవత్సరాల కల నెరవేరుతుంది.

  • ఓబిసి బిల్లును అమలు చేయాలి.

శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్, విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షురాలు ఊర గాయత్రి.

చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షించ దగ్గ విషయమని శ్రీకృష్ణ యాదవ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్, మాజీ కౌన్సిలర్ విద్యావంతుల వేదిక ఉపాధ్యక్షురాలు ఊర గాయత్రి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో సంవత్సరాల కల నెరవేరుతుందని, మహిళా బిల్లును వెంటనే అమల్లోకి తెచ్చి, ఓ బి సి మహిళలను చేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలోపే ఓ బి సి మహిళా రిజర్వేషన్ బిల్లును అమలులోకి తెస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఎక్కడైతే మహిళను గౌరవించబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారన్న నిజం ఇప్పుడు కలగానే మిగిలిపోతుందని తెలిపారు. ఈ బిల్లుకు సహకరించిన ప్రతి ఒక్క పార్టీకి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలు బాగుపడాలంటే చట్టసపోసుల్లోకి వెళ్లి వాళ్ల సమస్యల మీద పోరాడినప్పుడే అవి చట్ట రూపంలోకి దాలుస్తాయని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీల బ్రూణ హత్యలు, ఆత్మహత్యలు ఆగుతాయని అన్నారు. రిజర్వేషన్లు కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా చట్టసభల్లో ప్రవేశించేందుకు కూడా ఓబీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం మహిళలు గ్రామానికి మండలానికి మాత్రమే పరిమితం అవుతున్నారని ఓబీసీ బిల్లు వెంటనే అమలు చేస్తే మహిళలు చట్టసభల్లోకి వెళ్లి అన్ని సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు ఓబీసీ మహిళా బిల్లును ప్రవేశపెట్టే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

పోషకా ఆహారంతోనే రక్తహీనత రాకుండా ఉంటుంది – సూపర్వైజర్ బ్లాండిన

మహిళలకు33% రిజర్వేషన్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ కోటనువెంటనే ప్రకటించాలి