ఆదోని పట్టణములోని 35వ వార్డు పంజరాపోల్ వీధిలో వెలసిన అభయాంజనేయ వినాయక మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమములో వైఎస్సార్ పార్టీ జిల్లా కార్యదర్శి వెల్లాల మధుసూదన శర్మ పాల్గొని భక్తులకు అన్నప్రసాదము వితరణ చేసారు.ఈ సందర్భంగా మధుసూదనశర్మ మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథులను ఏర్పాటు చేసుకోవడము వలన కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొని సంతోషంగా పండుగను జరుపుకోవడానికి మంచి అవకాశం కల్గడమే కాకుండా సంవత్సరానికి ఒకసారి ఐదు రోజుల పాటు వీధిలోని ప్రజలంతా కలిసి సంతోషంగా గడపడానికి చాలా మంచి సువర్ణావకాశం గణనాథుని దయ వలన కలుగుతుంది అని మధుసూదనశర్మ అన్నారు..ఈ కార్యక్రమంలో కురువ రవి, అగ్గి రాముడు, అబ్రాహాము,భరత్, వేణు, లక్ష్మన్న, ప్రసాద్, వీరేష్, రాము, వీరేంద్ర అశోక్ మొదలైన వారు పాల్గొన్నారు…
This post was created with our nice and easy submission form. Create your post!