in , ,

ప్రజల సంతృప్తే లక్ష్యంగా పరిష్కారం- కలెక్టర్‌ నాగలక్ష్మి

జగనన్న చెబుదాం కార్యక్రమంలో వస్తున్న వినతులకు ప్రజల సంతృప్తే లక్ష్యంగా పరిష్కారం చూపాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిల్లాలో తొలిసారిగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మండల స్థాయిలో బుధవారం శృంగవరపుకోట మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 52 వినతులందాయి. కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, జెడ్‌పి సిఇఒ రాజ్‌కుమార్‌, మండల ప్రత్యేకాధికారి సుదర్శన దొర తదితరులు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకుని, ఆయా శాఖల అధికారులకు తగిన పరిష్కారం నిమిత్తం ఆదేశాలు జారీచేశారు. అత్యధికంగా రెవెన్యూశాఖకు 24, గృహనిర్మాణానికి 13 అర్జీలందాయి. ఇకపై ప్రతి బుధ, శుక్రవారాల్లో మండలస్థాయిలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజావినతులను స్వీకరిస్తారని తెలిపారు. మే 9న ఈ కార్యక్రమాన్ని చేపట్టిన నాటి నుంచి శృంగవరపుకోట మండలంలో 315 వినతులు జగనన్నకు చెబుదాంలో వచ్చాయని, ఈ సమస్యల పరిష్కారంపై 109 మంది అర్జీదారులను ఫోన్‌లో సంప్రదించగా 63 మంది నుంచి అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. జగనన్నకు చెబుదాంలో వచ్చిన వినతుల్లో మూడో వంతు రెవెన్యూకు సంబంధించినవే ఉంటున్నాయని చెప్పారు. ప్రస్తుతం చేపడుతున్న భూసమగ్ర సర్వే ద్వారా చాలా సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై సంతృప్తి
ఎస్‌.కోటలో పర్యటించిన కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్‌ వార్డు, ప్రసూతి వార్డు, మహిళా, పిల్లలు, ఆరోగ్యశ్రీ వార్డులను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య చికిత్సలు, సదుపాయాలు, భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ తదితర అంశాలపై ఆరాతీశారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి ఏవిధంగా వైద్యం అందుతున్నదీ తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయని, వైద్యులు సరిగా స్పందిస్తున్నారని పలువురు రోగులు కలెక్టర్‌కు వివరించారు.
మహిళా మార్టుకు ప్రశంసలు
ఎస్‌.కోట మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేయూత మహిళా మార్టును కలెక్టర్‌, జెసి మయూర్‌ అశోక్‌ సందర్శించారు. మార్టు నిర్వహణపై ఎపిడి సావిత్రి, మండల సమాఖ్య ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆరు నెలలక్రితం గరివిడి, శృంగవరపుకోటల్లో రెండు మహిళా మార్టులను ప్రారంభించామని, ఇక్కడ మార్టుపై రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టారని, ఆరు నెలల కాలంలో రూ.1.30 కోట్లు విక్రయాలు జరిపారని, అన్ని ఖర్చులూ పోను నెలకు రూ.3 లక్షల వరకు నెలకు లాభం వస్తుందని వారు జిల్లా కలెక్టర్‌కు వివరించారు. దీనిపై కలెక్టర్‌ సమాఖ్య సభ్యులను ప్రశంసించారు.
ఖీ ఎస్‌.కోట పట్టణంలోని 13వ వార్డు సభ్యులు చిప్పాడ శేషగిరి సర్వే నంబర్‌ 462లో 28 ఎకరాలు ఉన్న రాజు చెరువు ఆక్రమణకు గురైందని, అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. దానిని తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ స్థానిక అధికారులు స్పందించలేదని వివరించారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని తహశీల్దార్‌ను కలెక్టర్‌ ఆదేశించారు.
ఖీ తాటిపూడి వద్ద ఏర్పాటుచేసిన ప్రయివేటు లేఅవుట్‌కు ప్రభుత్వ భూముల్లో రహదారులు నిర్మించారని, నాలుగు చెరువులను ఆక్రమించుకున్నారని వైస్‌ ఎంపిపి సుధా రాజు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Prasad

Top Author
Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Post Views

నిధులు లేక ఇబ్బందులు పడుతున్నాం……

ఒక్క చిక్కీలేనా!!’