డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
అక్కా చెల్లెమ్మల్లో పేదవాళ్లు ఎక్కడున్నా వారికి మంచి జరగాలన్న తపన, తాపత్రయంతో ఈ నాలుగేళ్లలో అడుగులు వేస్తూ వచ్చామని 45 నుంచి 60 ఏళ్ల వయసులో, అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్కచెల్లెమ్మల చేతిలో ఈ డబ్బు పెడితే అది ఆ కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకంతో వైయస్సార్ కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలకు చెందిన వారికి ఏటా రూ. 15 వేల చొప్పున వరసగా 5 ఏళ్ల పాటు మొత్తంగా రూ. 75 వేల ఆర్థికసాయం చేసే వైయస్సార్ కాపు నేస్తం పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, చెముడులంక సర్పంచ్ తమ్మన శ్రీనివాసు అన్నారు. మండల పరిధి చెముడులంక శ్రీ కృష్ణదేవరాయ కళ్యాణ మండపంలో గ్రామానికి చెందిన 274 మందికి కాపు నేస్తం చెక్కును అందచేశారు. ముందుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మన మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ఏ అక్కచెల్లెమ్మకైనా అండగా నిలబడాలని ఓసీల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న పేదలకు వైయస్సార్ ఈబీసీ నేస్తం తీసుకొచ్చామని, కాపు అక్కచెల్లెమ్మలకు కూడా అదే తరహాలో మద్దతు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో, మేనిఫెస్టోలో చెప్పకపోయినా, వైయస్సార్ కాపునేస్తం పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఏ ఇతర ప్రభుత్వం ఎప్పుడూ అమలు చేయని కార్యక్రమని, రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో అక్కచెల్లెమ్మల కోసం అమలు చేస్తున్న వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఈబీసీ నేస్తం, వైయస్సార్ కాపునేస్తం కేవలం ఈ మూడు పథకాల ద్వారానే ఎంతో మందికి ఈ పథకాలతో తోడుగా ఉన్నామన్నారు. పేదల గుండె చప్పుడుగా సామాజిక న్యాయానికి చిరునామాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని, దేవుడి ఆశీస్సులతో ఇంకా మీకు ఉపయోగపడే పరిస్థితులు రావాలని రాబోయే రోజుల్లో మీరంతా ఈ ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో దొండపాటి వెంకటేశ్వరరావు (బులిరెడ్డి), దొండపాటి చంటి, నాగిరెడ్డి సత్యనారాయణ, మోటూరి సురేష్, బి వీర వెంకట్రావు, దొండపాటి శ్రీను, సుంకర శ్రీనివాసు పాలూరి వెంకటరమణ నాగిరెడ్డి వెంకటరాయుడు ముత్తాబత్తుల చిన వెంకయ్య పలువురి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు గృహసారథులు పాల్గొన్నారు.

[zombify_post]