పాడేరు నియోజకవర్గం, అల్గూరి సీతారామరాజు జిల్లా: గిరిజన బిడ్డలు ఉన్నత స్థానంలో నిలవాలని దానికోసం ఉపాధ్యాయులే కీలకం కావాలని పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం పాడేరు కాఫీ హౌస్ లో గిరిజన ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు కలెక్టర్ సుమిత్ కుమార్, ఐటిడిఏ పిఓ అభిషేక్, పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఘనంగా సన్మానించారు. ఉత్తమ సేవలందించిన 60 మంది టీచర్స్ కు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి గారు మాట్లాడుతూ మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని పురస్కరించుకొని 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయడం అనేది చాలా సంతోషకరమన్నారు. సమాజంలో ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలన్నా, గొప్ప ఉద్యోగాలలో గౌరవం పొందుతున్నారన్నా ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందని భాగ్యలక్ష్మి గారు పేర్కొన్నారు. సమాజంలో చాలా గౌరవప్రదమైన, బాధ్యతాయుతమైన ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ఉపాధ్యాయ వృత్తేనని భాగ్యలక్ష్మి గారు పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గౌరవించుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయమని భవిష్యత్తు తరాలకు ఉన్నతమైన విద్య అనేది ఎంతో అవసరం దానికి పునాది విద్యార్థుల నుంచే ఉపాధ్యాయులు తీర్చిదిద్దాల్సి ఉంటుందన్నారు. ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడాలంటే మన పిల్లలు కూడా ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన విద్యను అభ్యసించాలని దీనిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర వహిస్తారని విద్యార్థిలో దాగివున్న ప్రతిభ సామర్థ్యాలను వెలికి తీసే శక్తి కేవలం ఉపాధ్యాయులకే ఉందన్నారు. టీచర్స్ బోధించడమే కాకుండా విద్యార్థుల నుంచి ఆ తరహా ఫలితాలను రాబడినప్పుడే ప్రయోజనాలు చేకూరుతాయని భాగ్యలక్ష్మి గారు చెప్పారు. గిరిజన బిడ్డలంతా ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ఉపాధ్యాయులు పాత్ర కీలకమని అదే ఈ ప్రభుత్వం ఆశిస్తుందని తెలిపారు. గిరిజన ప్రాంత బిడ్డలు వేపగుంట వైటీసీలో శిక్షణ పొంది డీఎస్పీగా జీవన ఎంపిక అవడం అనేది నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్, ఐటీడీఏ పీవో అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]