నారా లోకేష్ ను హర్యానా డిప్యూటీ సీఎంతో పాటు బీఎస్పీ పార్లమెంటు సభ్యులు కలసి తమ మద్దతును తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ పార్టీ చేస్తున్న న్యాయపోరాటానికి తమ మద్దతును వారు ప్రకటించారు. ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ ను ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలాతో పాటు బీఎస్పీ పార్లమెంటు సభ్యులు డ్యానిష్ ఆలి, రితేష్ పాండేలు పరామర్శించారు.
