విశాఖపట్నంలోని పెద జాలరిపేట మత్స్యకారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ సముద్రంలో పడవలపై నుంచి నిరసన చేపట్టారు. సెంట్రల్ జైలు నుంచి ఆయనను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. తెలుగుదేశం హయాంలోనే మత్స్యకారుల కుటుంబాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని జీవీఎంసీ టీడీపీ కార్పొరేటర్ నొల్లి నూకరత్నం తెలిపారు. చంద్రబాబు తమకు ఇళ్లు, ఇంటి పట్టాలు ఇచ్చారని.. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.