చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక సమావేశాల వేళ.. ఈ బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందితే.. రాష్ట్ర శాసన సభ, లోక్ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి.
