ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ;
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉత్తర తెలంగాణ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు ఏర్పాటుచేసిన జెండాను ఆవిష్కరణ చేసి తదనంతరం స్వీట్ల పంపిణీ నిర్వహించారు .ఈ కార్యక్రమానికి హాజరైన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి మాట్లాడుతూ భారత దేశ సంస్థానం లో ఇతర దేశంగా ఉండాలని ఆనాడు ఎన్నో కుట్రలు చేసిన నైజాం కు వ్యతిరేకంగా చివరికి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందని అన్నారు .తెలంగాణ దేశంలో ఒక కుల ,మత, భేదం లేని రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని తరిమికొట్టి నూతన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని సింహం గుర్తుకు ఓటు వేసి బలపరచాలని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం వీరోచితంగా సాగిందని ఎంతోమంది అసువులు బాసారని ప్రతి ఒక్కరికి మా యొక్క ఘన నివాళులు తెలుపుతున్నట్లు తెలిపారు .ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్ దీప్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఒక సంస్థానంగా ఉండి ప్రత్యేక దేశంగా చూడాలనుకుని ఆనాడు నిజాం రాజులు ఎంతో దౌర్జన్యాలు ఈ తెలంగాణ గడ్డపై చేశారని వారికి ఎదురుగా వెళ్లి ఎంతోమంది హీరోచితంగా పోరాటం చేసి నాటి ఉద్యమంలో మరణించిన ప్రతి ఒక్కరికి ప్రగాఢ నివాళులు తెలుపుతున్నట్లు తెలిపారు. సాధించిన నాటి తెలంగాణ నేడు మళ్లీ అదే దొరల పాలనలో ఉందని దీనిని బందీ నుండి విముక్తి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు . ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి మద్దతు తెలిపి సింహం ఓటు వేయాలని అన్నారు .ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల విజయకుమార్ ,నియోజకవర్గ కన్వీనర్ పెద్దెల్లి శేఖర్ నగర అధ్యక్షులు సత్య రావు, టి యు సిసి జిల్లా కన్వీనర్ కురువెల్లి శంకర్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు న్యాయవాది అతికం రాజశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

[zombify_post]