in ,

వర్షాలకు నష్టపోయిన రాజ్మా రైతులను పరిహారం ఇచ్చి ఆదుకోవాలి: సీపీఎం పార్టీ డిమాండ్,

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కర్రిముక్కిపుట్టు పంచాయితిలో  పర్యటనలో భాగంగా సీపీఎం జిల్లా కమిటి సభ్యులు లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాధ్, మండల కార్యదర్శి పాంగి.భీమరాజు బర్రంగుల,దశరిపుట్టు,తంగుల గ్రామాల్లో సందర్శించి నష్టపోయిన రైతులతో కలిసి దెబ్బతిన్న కొర్ర.వెంకటరావు రాజ్మా పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా త్రినాధ్,భీమరాజు రైతులతో మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో భారీగా కురిసిన వర్షాల కారణంగా రాజ్మా రైతులు తీవ్రంగా నష్టపోయారని కర్రిముక్కిపుట్టూ,బంగరుమెట్ట, కిల్లగడ,దార్రెల,బాబు శాల,కుమడ,బుసిపుట్,ఏనుగు రయి,వనభసీంగి, దారెల,పెద్దగుడ,జరేల,జర్జుల,కించాయిపుట్టు తదితర పంచాయితీ పరిధిలో ఎక్కువ గ్రామాల్లో రాజ్మా పంట మీద ఆధారపడి బ్రతుకుతున్నారు,మొలకెత్తిన  వారం పది రోజుల్లో భారీగా కురిసిన వర్షాల కారణంగా పంట పోయిందని,అందుకు అదికారులు గ్రామంలో సందర్శించి నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం, ఇందులో కొర్ర.వేకటరావు,కొండలరావు తదితులున్నారు,

[zombify_post]

Report

What do you think?

ప్రజలకు వారధి జర్నలిస్టులు.

గిరిజనుడుపై దాడి చేసిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలి