నర్సీపట్నం.ప్రజలకు జర్నలిస్టులు వారధి వంటి వారని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఈమేరకు ఆదివారం ఆర్డీవో సమావేశం మందిరంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ(JAAP) సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిలుగా ఎమ్మెల్యే గణేష్,ఆర్డీవో గోవిందరాజు హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో జర్నలిస్టుల సమస్యలను వారికి వివరించారు. త్వరలో నర్సీపట్నం జాప్ యనియన్ కు సమావేశ మందిర నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రూ.5లక్షల ప్రమాద భీమా పత్రాలను జర్నలిస్టులకు అందజేశారు. ఈకార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ జర్నలిస్టులు హాజరయ్యారు.
[zombify_post]