జగిత్యాల రూరల్ మండల చల్ గల్ గ్రామానికి చెందిన 100 మంది నాయకులు యువకులు మహిళలు కాంగ్రెస్,బిజెపి పార్టీ ల నుండి లక్ష్మి పుర్ గ్రామానికి చెందిన 25మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు. చలగల్ గ్రామానికి ఇప్పటివరకు 51 నిధులు అభివృద్ధి సంక్షేమ పథకాలకు మంజూరు చేయడం జరిగింది. చల్గాల్ గ్రామంలో 1344 మంది రైతులకు రైతుబంధు ద్వారా ఇప్పటివరకు 11 కోట్ల 64 లక్షలు వారి ఖాతాలో జమయ్యాయి. గ్రామంలో 199 మందికి కల్యాణ లక్ష్మి,షాది ముభరక్ చెక్కులు మంజూరు చేయటం జరిగింది అని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 33 మెడికల్ కళాశాలలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్, బీడీ పెన్షన్ ,బతుకమ్మ చీరలు, ఆరోగ్యలక్ష్మి ,ఆరోగ్య మహిళా, శీ టీమ్స్, ఇలా మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిన పార్టీ బి అర్ ఎస్ మాత్రమే. రాష్ట్రంలో విద్య వైద్యానికి,వ్యవసాయానికి పెద్ద పీట. కవితక్క పై అసత్య ప్రచారాలు మానుకోవాలి. ప్రజల ఆదరణ చూసి, ప్రతిపక్షాలు ఓటమి భయంతోనే అసత్య ఆరోపణలు. ఇందిరా భవన్ పేరు పెట్టుకొని ఇందిరమ్మని తిట్టిన చరిత్ర ఎవరిది. మాజీ సీఎం రాజ శేఖర్ రెడ్డి గారి కొడుకు జగన్ అవినీతి పై మన్ మోహన్ సింగ్,సోనియా దర్యాప్తు జరిపి జైలు కి పంపిన విషయం గుర్తు లేదా. స్కాం లకు మారుపేరు కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, నాయకులు దావా సురేష్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,రైతు బందు సమితి మండల కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి,సర్పంచ్ లు ఎల్ల గంగనార్సు రాజన్న,చెరుకు జాన్,ఎంపీటీసీ సునీత లక్ష్మణ్,గ్రామ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]