విశాఖపట్నం: జనసేన టిడిపి పొత్తుపై దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కందుల నాగరాజు స్పందించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా జనసేన పార్టీ రాష్ట్ర రథసారథి పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్న అందుకు కట్టుబడి పని చేస్తామని వారు నిర్ణయమే మాకు శిరోధార్యమని దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కందుల నాగరాజు తెలిపారు. జనసేన పార్టీ ఆశయ సాధనలో రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అధ్యక్షులు వారు ఆదేశానుసారం పార్టీ నిర్ణయానికి కట్టుబడి దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని కందుల నాగరాజు తెలిపారు.
[zombify_post]