దసరా సమయంలో రైళ్లకు ఈసారి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా హౌరా, బెంగళూరు ప్రాంతాలకు నడిచే రైళ్లలో బెర్తులు అప్పుడే రిజర్వు అయిపోయాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో విశాఖ మీదుగా హౌరా వెళ్లే రైళ్లలో అక్టోబరు 14 నుంచి నెలాఖరు వరకు బెర్తులు ఖాళీ లేవు. ఇక, బెంగళూరు పరిసర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు అక్టోబరు 21 నుంచి నెలాఖరు వరకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి సికింద్రాబాద్, చెన్నై పరిసర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మాత్రం బెర్తులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ, విద్య, వ్యాపార రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వాసులు విజయదశమికి స్వగ్రామాలకు వస్తారు. అలాగే నగరంలో ఉంటున్న ఇతర ప్రాంతాల వారు…స్వస్థలాలకు వెళతారు. ఈ నేపథ్యంలో సహజంగానే రైళ్లకు డిమాండ్ ఉంటుంది.
[zombify_post]