విశాఖ. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తాము చట్టాన్ని నిలబెడతామని విశాఖ కొత్త పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యర్ హామీ ఇచ్చారు. మహిళా, భద్రత, ట్రాఫిక్, డ్రగ్స్ నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సాధిస్తామని రవిశంకర్ పేర్కొన్నారు. ఆయన గురువారం పాత సిపి డాక్టర్ త్రివిక్రమ్ వర్మ నుంచి బాధ్యతలు స్వీకరించిన అనంతరం రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. విశాఖలో అదనపు డీజీగా ఆయనే తొలిసారి వ్యవహరించనున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను అధిగమిస్తామని, పర్యాటక పోలీస్ స్టేషన్ల ఏర్పాటును ఉన్నతధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మీరు సీపీగా రావడం పై ఏమైనా ప్రత్యేకత ఉంటుందా అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు రవిశంకర్ సమాధానం ఇస్తూ, విశాఖ పాలన రాజధాని కాబోతుందని బహుశా అందుకే తన్ను నియమించినట్లు భావించమన్నారు. ఫోర్త్ టౌన్ పరిధిలో జరిగిన రీతు సహా అనే బాలిక అనుమానస్పద కేసు విషయమై తాను పత్రికల్లో చూసానని తదుపరి దర్యాప్తును సమీకిస్తామన్నారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణ పై దృష్టి సారిస్తామని, అదే సమయంలో వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటామన్నారు. విశాఖ కమిషనరేట్ ను అదనపు డీజీ పోస్టుకు అప్డేట్ చేసిన నేపథ్యంలో సిబ్బందిని పెంచే విషయంలో సీఎం దృష్టికి తీసుకెళ్ళన్నామని, ఇప్పటికే ఏపీలో 6,500 మంది సిబ్బంది నియామక ప్రక్రియ జరుగుతుందని, శాఖ ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని అదనపు సిబ్బందితో పాటు, జాయింట్ సీపీ వంటి పోస్టులన్ని భర్తీ చేస్తామన్నారు. విశాఖకు మీరిచ్చే ప్రాధాన్యత ఎలా ఉంటుందని ప్రశ్నకు తాను శాంతిభద్రతల అదనపు డిజీగా చేసినప్పుడు తనకు విశాఖ కమిషనరేట్ పై అవగాహన ఉందన్నారు. ఎన్ ఐ ఏ వంటి ఏజెన్సీలు ప్రారంభమైనప్పుడు ఆ విభాగంలో పని చేసిన అనుభవం కూడా తనకు ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్న నేరాల నమోదు పైన అవగాహన ఉందని, దిల్సుఖ్నగర్ పేలుళ్లు వంటి కేసుల్ని చేదించే విషయంలో తాను సమర్థవంతంగా పనిచేశానని గుర్తు చేశారు. హైదరాబాదులో దిసిపిగా పనిచేసిన సమయంలో మంచి మంచి కేసులు పరిష్కరించానన్నారు. విశాఖలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, మీడియా, పోలీస్ సిబ్బంది సహకరించాలని ఈసందర్భంగా ఆయన కోరారు.
[zombify_post]