ఇల్లులేని నిరుపేదల సొంతింటి కళను నెరవేర్చాలనే సంకల్పంతో పొత్తూరు గ్రామంలో రెండు పడకల గదుల ఇళ్లను నిర్మాణం చేయడం జరిగిందని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు అన్నారు.మండలంలోని పొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మాణం చేసిన రెండు పడకల గదుల ఇళ్లను గురువారం రోజున గ్రామ సర్పంచ్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సిద్ధం వేణు మాట్లాడుతూ రెండు పడకల గదుల ఇళ్లను శుక్రవారం (15-09-2023) రోజున సాయంత్రం 4 గంటలకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు.ఇల్లులేని నిరుపేదలకు రెండు పడకల గదుల ఇళ్లను కట్టించడంతో పాటు ఇంటి స్థలం ఉన్న వారికి గృహాలక్ష్మి పథకం ద్వారా మూడు లక్షల సాయం అందించడం జరుగుతున్నదని పేర్కొన్నారు.
[zombify_post]