– డ్రైవర్, ఓనర్ పై కేసు నమోదు
ముద్ర,ఎల్లారెడ్డిపేట:
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను గురువారం ఎల్లారెడ్డిపేట పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై రమాకాంత్ వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ TS 23T 0690 నెంబర్ గల వాహనాన్ని పట్టుకొని ఇసుక కు సంబంధించిన పత్రాలను చూపించమని డ్రైవర్ ను అడుగగా ఎలాంటి పత్రాలు లేనందున అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ తో పాటు డ్రైవర్ వేముల రమేష్, ఓనరు గంతుల రమేష్ లు గొల్లపల్లి కి చెందిన ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమాకాంత్ పేర్కొన్నారు. అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.ఇసుక ట్రాక్టర్ పట్టివేత
– డ్రైవర్, ఓనర్ పై కేసు నమోదు
[zombify_post]