పాడేరు , అల్లూరి జిల్లా: లొంగిపోయిన మాజీ మావోయిస్టు ఎం. జలంధర్ రెడ్డికి ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంటు గ్యారెంటీ ప్రోగ్రాంలో రూ .16.55 లక్షల ఆర్దిక సహాయం చెక్కును జిల్లా కలెక్ట్ సుమిత్ కుమార్ సోమవారం ఆయన కార్యాలయంలో అందజేసారు. రూ.4.13 లక్షల సబ్సిడీని ప్రభుత్వం ఇస్తోందన్నారు. ట్రాక్టరు కొనుగోలు చేసుకుంటే పనులు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంకు మేనేజర్ ఎల్. భాను చందర్, ఎల్ డి ఎం రవి తేజ, ఫీల్డ్ ఆఫీసర్ పి. ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]