విజయనగరం జిల్లాలో నలుగురు సభ్యులతో కుమ్మరి, శాలివాహన సంక్షేమ కమిటీ ఏర్పాటైనట్లు ఆ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ మండేపూడి పురుషోత్తం వెల్లడించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే అధికారిక కమిటీలో అధికారులతో పాటు, గుర్ల లక్కవరపుకోట, విజయనగరం, గజపతినగరం మండలాలకు చెందిన వారిని సభ్యులుగా కలెక్టర్ నియమించినట్లు తెలిపారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కలెక్టర్‌ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసారు.
[zombify_post]