పాడేరు, అల్లూరి జిల్లా:- పెండింగ్ లో ఉన్నఅక్రిడిటేషన్ కార్డుల దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి రెండవ విడత అక్రిడిటేషన్ కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పౌర సంబంధాల అధికారి పి. గోవింద రాజులు తెలిపారు. మొదటి విడతలో 120 మంది అర్హులకు కార్డులు జారీ చేయటం జరిగిందని, ఆన్లైన్ లో ఇంకనూ ఉన్న దరఖాస్తులు పరిశీలించటం జరుగుతోందని వివరించారు. అందులో భాగంగా ఇంకా అర్హతలు కలిగి ఉండి దరఖాస్తు చేసుకోలేని వారు, వారి అర్హతల మేరకు ఈ నెల 25 వ తేదీ లోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని డిపిఆర్ఓ సూచించారు. అదేవిధంగా ఇప్పటికే ఆన్లైన్ చేసిన వారు మరొక సారి వారి దరఖాస్తులు పరిశీలించుకొని సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలని కోరారు. అదేవిధంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా అర్హత గల వారు కూడా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపి అందజేయాలన్నారు. 25 వ తేదీ లోగా ఆన్లైన్ చేయటంతో పాటు హార్డ్ కాపీని సంబంధిత డాక్యుమెంట్లు, మూడు పాస్పోర్ట్ సైజ్ పొటోలు, వ్యక్తిగత ధృవీకరణ పత్రం జత చేసి కలక్టరేట్ లో గల డిపిఆర్ఓ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఆయా దరఖాస్తులు పరిశీలించి అక్టోబర్ మొదటి వారంలో కార్డులు జారీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు.
*వర్కింగ్ జర్నలిస్టులకు హెల్త్ కార్డులు :- జిల్లాలో పనిచేయుచున్న వర్కింగ్ జర్నలిస్టులు వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం కు దరఖాస్తు చేసుకోవచ్చని డిపిఆర్ఓ తెలిపారు. ఇప్పటికే హెల్త్ కార్డు పొందిన వారు నవీకరంకు దరఖాస్తు చోసుకోవాలని కోరారు. అందుకు అక్రిడిటేషన్ కలిగి ఉన్న జర్నలిస్టులు రూ.1250లు ట్రజరీ చలాన ద్వారా చెల్లిస్తే, మిగిలిన రూ.1250లు ప్రభుత్వం తరుపున సమాచార శాఖ చెల్లిస్తుందని వివరించారు.
[zombify_post]