సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన గుడ్డల శ్రీనివాసరావు(44), అతని కుమారులు నరేష్ మధులమధ్య భూ వివాదం నేపథ్యంలో ఘర్షణ జరిగింది. నరేష్, మధు లు తమ తండ్రి శ్రీనివాసరావు పై కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే సత్తుపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించి చికిత్స అందిస్తున్న గా మృతి చెందాడు. మృతుడి సోదరుడు వీరభద్రం ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
[zombify_post]